Wednesday 15 July 2015

Stampede Deaths...Who is Responsible..?

పుష్కర మరణాలు...తప్పు ప్రభుత్వనిధే..మరి ప్రజలది..?

తొక్కిసలాట మరణాలు మన సమాజ స్థితి గతులకి ప్రత్యేక నిదర్శనం. పేరు గొప్ప నాయకులు, పోలీసులు ఇవేవీ ఈ ఉత్పాతాని ఆపలేకపోయారు.  పూర్తి స్థాయి వసతులు ఏర్పరాచకుండా, పుష్కరాల గొప్పతనం వివరిస్తూ అంధారిని ఆహ్వానించిన ప్రభుత్వం ధీనికి బాధ్యత వహించాలి.
మరి పూర్తి బాధ్యత ప్రభుత్వనిధేన, మరి నేనంటే నేను ముందు అని తోసుకుంటూ వెళ్ళిన క్రమశిక్షణ లేని ప్రజలకి బాధ్యత లెధా.
అసలు ప్రజలమైన మనం ఎంత వరకు క్రమశిక్షణ తో మెలుగుతున్నాం.

అసలు మనంధారికి సినిమా థియేటర్ లో టికెట్స్ కొనుక్కొవాటానికి గేట్స్ తోసుకుంటూ, ఎక్కడ టికెట్స్ అయిపోతాయో అని పరిగెట్టటం, లేఖపోతే black లో టికెట్స్ కొనుక్కునే సంస్కృతిని అన్ని చోట్ల పాటిస్తున్నాం.

నగరాలలో, పట్టణాలలో చూస్తే మనం వాహనాలు ఇష్టం వాచినట్టు నడుపుతూ, ట్ర్యాఫిక్ నిబంధనలు పాటించాం. 90% ప్రమాధాలు మన నిర్లక్ష్యమే కారణం.

భక్తి తో పుణ్యక్షేత్రలైన తిరుపతి కి , శ్రీశైలం కి వెళ్తాం, అక్కడ అధె కధ.  దేవుడు ఏమన్నా మాయమవుతాడా అన్నటుగా ఒకరిని ఒకరు తోసుకుంటూ, compartments నుంచి పరిగెత్తుతాం. ప్రశాంతం గా, ఆద్యాత్మికతతో ఉండాల్సిన చోటుకుడా అరుపులు, కేకలు మరియు తోపులాటలు.

ఎక్కడ పడితే అక్కడ మాల మూత్ర విసర్జన చేస్తాం, నడిరోడ్డు మీదా ఉమ్ములు వేస్తాం, అదేమంటే మా ఇస్తాం చల్తా బాస్ అంటాం.

మన ఆడ కూతుర్ల మీద నిర్భయంగా మానభాంగాలు జరుగుతుంటే మన మనోభావాలు దెబ్బతినవు. ఆది జస్ట్ పక్క గళ్లిలో జరిగిన ఒక క్రైమ్ మాత్రమే. అదే కులం,మతం,ప్రాంతం పేరు చెబితే చాలు "ఊ ఊ" అంటూ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ విధులలో కుక్కల వలె కోట్లడుతాం.

మనమంధారం, నాతో సహా, చవతలం, పిరికివాల్లం,క్రమశిక్షణ లేని వాళ్ళం. మరి మనలాంటి వాళ్ళు ఎన్నుకొనే నాయకులు మనలాగే ఉంటారు, మరి ఈ నాయకులు నడుపుతున్న ప్రభుత్వాలలో అవినీతి జరుగుతూనే ఉంతుంధీ, తొక్కిసలాట లు జరుగుతూనే ఉంటాయి.    

కాబ్బట్టి ప్రభుత్వాలు మరాలంటే ముందు నేను మారాలి, మనం మారాలి.

ఈ పుష్కర దుర్గటన మనకి కనువిప్పు కావాలి, సమాజంలో క్రమశిక్షణ పెరగటానికి ప్రయతనిద్దాం. నేను క్రమశిక్షణతో మెలుగుతా, మనం క్రమశిక్షణతో మెలుగుడామ్.

యధా ప్రజా తధా ప్రభుత్వం.
http://www.reformstv.com/video_listing/stampede-deaths-who-is-responsible/

No comments:

Post a Comment