Monday, 8 June 2015

జలాహారం పైలాన్ ను ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పథకం వాటర్ గ్రిడ్ పథకం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటికి సురక్షిత నీరందించే వాటర్ గ్రిడ్ పథకం పైలాన్‌ ను నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఆవిష్కరించారు. పైలాన్ చుట్టూ అమర్చిన 26 వాటర్‌గ్రిడ్ ఫౌంటెన్‌లలోకి నీటిని విడుదల చేశారు. పైలాన్ ఆవిష్కరణకు చౌటుప్పల్ వచ్చిన ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానిక సర్పంచ్ లావణ్య, మహిళలు కేసీఆర్‌కు మంగళహారతులు పట్టారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు డా.బూర నర్సయ్య, బాల్కా సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, అధికారులు రేమండ్ పీటర్, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment