ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు పంపింది చంద్రబాబునే అనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ముందుగా ఏపీ సి.ఎం చంద్రబాబుకు నోటీసులిస్తారనే చర్చ జరిగినా తెలంగాణ ప్రబుత్వం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చే కన్నా నేరుగా అరెస్టు చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి చంద్రబాబును అరెస్టు చేసేందుకు సిద్దమైనా తర్వాత తెలంగాణ సర్కారు వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏం జరిగినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు టీడీపీ క్యాడర్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు మంత్రులందిరినీ తమ జిల్లాలకు పంపారనే వాదన సాగుతోంది.
ఓటు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు తన ఫోన్ కాకుండా మరొకరి ఫోన్ తో మాట్లాడటాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. వారి ఆదేశాలను తీసుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారనే వాదన సాగుతోంది. అందుకే అటు ఆంధ్రప్రదేశ్ నే కాదు ఇటు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా చంద్రబాబును అదుపులోకి తీసుకుని తన పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారిస్తారనే అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపికైంది. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో గంట గంటకు ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని రకాల ఆధారాలు ఉన్న చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ఈ నేపధ్యంలో వెనక్కు తగ్గేకన్నా ముందుకే వెళ్లేందుకు కేసీఆర్ టీమ్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు చంద్రబాబు అరెస్టును ఆపేందుకు కేంద్ర మంత్రులిద్దరు తమ శక్తి వంచన లేకుండా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. అయినా బీజేపీ అద్యక్షుడు అమిత్ షా గానీ, ప్రధాని నరేంద్ర మోదీ గానీ సరైన హామీ ఇవ్వలేకపోయారనే ప్రచారం టీఆర్ఎస్ లో గుప్పు మంటోంది. అదే నిజమైతే ఇక చంద్రబాబు అరెస్టును ఎవరు ఆపలేరంటున్నారు గులాబీ దళం
No comments:
Post a Comment